శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 05, 2020 , 00:26:00

ఢిల్లీ హింసాకాండపై విచారణ జరుపండి

ఢిల్లీ హింసాకాండపై విచారణ జరుపండి
  • జాప్యం సమర్థనీయం కాదు.. ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, మార్చి 4: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మతఘర్షణలకు కొందరు బీజేపీ నేతలు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా కారణమని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది. హింసాత్మక ఘటనలకు సంబంధించిన పిటిషన్లపై విచారణలో జాప్యం సమర్థ్ధనీయం కాదని వ్యాఖ్యానించింది. ఈశాన్య ఢిల్లీలో ఇటీవల చెలరేగిన హింసాకాండకు కొందరు బీజేపీ నేతలు చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా కారణమని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ అందులో పేర్కొన్నారు. అయితే, దీనిపై ఏప్రిల్‌ 13న విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు చేసింది.


logo