శనివారం 05 డిసెంబర్ 2020
National - Oct 30, 2020 , 17:16:53

శుక్లా హ‌త్య కేసు.. షార్ప్ షూట‌ర్స్ ఇద్ద‌రు అరెస్టు

శుక్లా హ‌త్య కేసు.. షార్ప్ షూట‌ర్స్ ఇద్ద‌రు అరెస్టు

కోల్‌క‌తా : బీజేపీ నేత మ‌నీశ్ శుక్లా హ‌త్య కేసులో పోలీసులు బీహార్‌కు చెందిన‌ ఇద్ద‌రు షార్ప్ షూట‌ర్స్‌ను అరెస్టు చేశారు. ప‌శ్చిమ‌బెంగాల్ సీఐడీ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నిందితుల‌ను బీహార్‌లోని స‌మ‌స్తిపూర్ జిల్లా నివాసి సుజిత్ కుమార్ రాయ్, వైశాలి జిల్లాకు చెందిన రోష‌న్ కుమార్ యాద‌వ్‌గా గుర్తించారు. ‌వీరిద్దరిని కోల్‌కతాకు తీసుకువచ్చి ఏసీజేఎం బరాక్‌పూర్ న్యాయ‌స్థానం ముందు హాజరుపరిచారు. పశ్చిమ బెంగాల్ సీఐడీ వర్గాల సమాచారం ప్రకారం.. శుక్లా హత్యకు పాల్పడిన అసలు షూటర్లలో వీరిద్దరూ కూడా ఉన్న‌ట్లు తెలిపారు. అక్టోబ‌ర్ 4వ తేదీన‌ టిటాగ‌ర్ పోలీసు స్టేష‌న్ ముందు శుక్లా నిల‌బ‌డి ఉండ‌గా బైక్‌పై వ‌చ్చిన సాయుధులు కాల్పులు జ‌రిపారు. వెనువెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వెల్ల‌డించారు. బ‌రాక్‌పూర్ క‌మిష‌న‌రేట్ నుండి ఈ కేసును ప‌శ్చిమ‌బెంగాల్ సీఐడీ తీసుకుంది. హ‌త్య కేసుకు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురిని అరెస్టు చేశారు.