శుక్రవారం 29 మే 2020
National - Mar 28, 2020 , 16:19:13

క్వారెంటైన్ ముద్ర ఉన్నా కామ‌న్‌సెన్స్ లేకుండా..

క్వారెంటైన్ ముద్ర ఉన్నా కామ‌న్‌సెన్స్ లేకుండా..

వ‌రంగ‌ల్‌: ప‌్ర‌పంచ దేశాల‌ను క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ది. ఈ మ‌హ‌మ్మారికి భ‌య‌ప‌డి అన్ని దేశాలు స్వీయ నిర్భంధంలోకి వెళ్లాయి. మ‌న దేశంలోనూ జ‌నం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వైర‌స్ ప్ర‌భావం ఇంత తీవ్రంగా ఉన్నా విదేశాల నుంచి వ‌చ్చిన  కొంద‌రు మాత్రం బ‌రితెగించి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 14 రోజుల‌ హోమ్ క్వారెంటైన్ నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కి య‌థేచ్ఛ‌గా రోడ్ల‌పై తిరుగుతున్నారు. 

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాలో ఇద్ద‌రు వ్య‌క్తులు చేతిపై హోమ్ క్వారెంటైన్ ముద్ర‌లు ఉన్న ఖాత‌రు చేయ‌కుండా రోడ్ల‌పై వ‌చ్చార‌న్న వార్త తీవ్ర‌ క‌ల‌క‌లం రేపింది. ఇటీవ‌ల విదేశాల నుంచి వ‌చ్చిన‌ ఒక యువ‌తి, యువ‌కుడు చేతుల‌పై హోమ్ క్వారెంటైన్ ముద్ర‌లు ఉన్నా నిర్ల‌క్ష్యంగా రోడ్ల‌పైకి రావ‌డంతో పోలీసులు ప‌ట్టుకుని క్వారెంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోనూ ఓ వ్య‌క్తి హోమ్ క్వారెంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి రోడ్ల‌పైకి రావ‌డంతో క్వారెంటైన్ సెంట‌ర్కు త‌ర‌లించారు.   


  


logo