శుక్రవారం 05 జూన్ 2020
National - Apr 04, 2020 , 10:09:46

పోలీస్ సైర‌న్ విని గుండెపోటు.. వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు మృతి

పోలీస్ సైర‌న్ విని గుండెపోటు.. వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు మృతి

అమ‌రావ‌తి: క‌రోనా వైర‌స్ విజృంభ‌న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. ఎవ‌రైనా లాక్‌డౌన్‌ను ధిక్క‌రించి బ‌య‌ట‌కు వ‌స్తే పోలీసులు లాఠీల‌కు ప‌నిచెబుతున్నారు. దీంతో కొంత‌మంది పోలీస్ సైర‌న్ వింటేనే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లు ప‌ట్ట‌ణం, చింత‌ల‌పూడి మండ‌లంలో చోటుచేసుకున్న వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఇలా పోలీస్ సైర‌న్‌కు భ‌య‌ప‌డే ఇద్ద‌రు వ్య‌క్తులు గుండెపోటుతో మృతిచెందారు. 

పాల‌కొల్లు ల‌జ‌ప‌తిరాయ్‌పేట‌లోని ఓ హోట‌ల్ వ‌ద్ద శుక్ర‌వారం కొంద‌రు వ్య‌క్తులు గుమిగూడారు. అదే స‌మ‌యంలో సైర‌న్ మోగిస్తూ పోలీసులు అక్క‌డికి చేరుకోవ‌డంతో జ‌నం భ‌యంతో ప‌రుగులు తీశారు. ప‌రుగెడుతూనే వేండ్ర వీరాంజ‌నేయులు అనే 57 ఏండ్ల‌ వ్య‌క్తి గుండెపోటుతో కుప్ప‌కూలి అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. చింత‌ల‌పూడి మండ‌లం వెంక‌టాపురం గ్రామంలోనూ ఇలాంటిదే మ‌రో ఘ‌ట‌న జ‌రిగింది. శుక్ర‌వారం రాత్రి కొంద‌రు ఇండ్ల ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స‌రిగ్గా అప్పుడే పోలీసులు సైర‌న్ మోగిస్తూ అక్క‌డికి చేరుకోవ‌డంతో అంద‌రూ ఇండ్ల‌లోకి ప‌రుగులు తీశారు. ఈ క్ర‌మంలో గుండెపోటు ప‌సుమ‌ర్తి భాస్క‌ర్‌రావు అనే 55 ఏండ్ల వ్య‌క్తి గుండెపోటు వ‌చ్చి కుప్ప‌కూలాడు. ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు చెప్పారు.    

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo