బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 08:35:24

ఐసీయూలో 2 శాతం మంది కోవిడ్ పేషెంట్లు..

ఐసీయూలో 2 శాతం మంది కోవిడ్ పేషెంట్లు..

హైద‌రాబాద్‌: భార‌త్‌లో కోవిడ్ కేసుల సంఖ్య ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే త‌క్కువే ఉన్న‌ది. అంతే కాదు, ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా త‌క్కువ‌గానే ఉన్న‌ది.  కేవ‌లం రెండు శాతం మంది పేషెంట్లు మాత్ర‌మే మ‌న దేశంలో ఐసీయూలో కోవిడ్ చికిత్స పొందుతున్న‌ట్లు తెలిసింది.  దేశ‌వ్యాప్తంగా మొత్తం 1559 మంది రోగులు ఐసీయూ చికిత్స పొందుతున్నారు. ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 82 వేల‌కు చేరుకున్న‌ది. దాంట్లో 51 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 2649 మంది మ‌ర‌ణించారు. 28 మంది రోగులు కోలుకున్నారు. యాక్టివ్ కేసుల్లో 3.07 శాతం మంది రోగులు ఐసీయూలో ఉన్నారు. మ‌రో 0.44 శాతం మంది వెంటిలేట‌ర్ల‌పై ఉన్నారు. 2.65 శాతం మాత్రం ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌పై ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.


logo