శనివారం 06 జూన్ 2020
National - May 08, 2020 , 20:11:50

పోలీసుల‌పై కాల్పులు జ‌రిపిన ఇద్ద‌రు అరెస్ట్‌

పోలీసుల‌పై కాల్పులు జ‌రిపిన ఇద్ద‌రు అరెస్ట్‌

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌: ఉత్త‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఫామ్లీ జిల్లాలో పోలీసుల‌పై కాల్పులు జ‌రిపి పారిపోయిన ఇద్ద‌రు నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం చెక్‌పోస్టు వ‌ద్ద త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌పై నిందితులు కాల్పులు జ‌రిపారు. వారిలో ఒక‌రిని ముంత్యాజ్‌గా గుర్తించారు. వారిని ప‌ట్టుకుంటే రూ. 15వేల రివార్డును కూడా పోలీసులు ప్ర‌క‌టించారు. నిందితుల కోసం గాలిస్తుండ‌గా ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళుతున్న ముంత్యాజ్ పోలీసుల‌కు క‌నిపించాడు. అత‌డు మ‌ళ్లీ కాల్పులు ప్రారంభించ‌డంతో పోలీసులు ఎదురుకాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ముత్యాంజ్‌కు గాయాల‌య్యాయి. పోలీసులు నిందితుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి రెండు తుపాకులు, 300 కిలోల ఆవు మాంసం స్వాధీనంచేసుకున్నారు. నిందితుడితో పాటు ఉన్న మ‌రో వ్య‌క్తిని కూడా అరెస్ట్ చేశారు. 


logo