సోమవారం 13 జూలై 2020
National - Jun 20, 2020 , 00:59:26

24 గంటల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

24 గంటల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

  • కశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు

శ్రీనగర్‌, జూన్‌ 19: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు 24 గంటల వ్యవధిలో 8 మంది ఉగ్రవాదులను హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని మీజ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో       గురువారం బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిపాయి.  ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు సమీపానే ఉన్న ఓ మసీదులోకి వెళ్లి తలదాచుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరు ముష్కరులు మసీదు నుంచి బయటికి రాగానే బలగాలు హతమార్చాయి. మరో ఘటనలో షోపియాన్‌ జిల్లాలోని మునాద్‌-బాంద్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ కాల్పులు శుక్రవారం కూడా కొనసాగడంతో మరో నలుగురు ముష్కరులు హతమయ్యారు. ఇలా రెండు ఎన్‌కౌంటర్లలో కలిపి మొత్తం 8 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 


logo