గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 09:16:38

నా క్యాబినెట్‌లో ఇద్ద‌రికి క‌రోనా: పుదుచ్చేరి సీఎం

నా క్యాబినెట్‌లో ఇద్ద‌రికి క‌రోనా: పుదుచ్చేరి సీఎం

చెన్నై: సెమీ స్టేట్ పుదుచ్చేరిలోనూ క‌రోనా వైర‌స్ క్ర‌మంగా విస్త‌రిస్తున్న‌ది. రోజురోజుకు కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. తాజాగా పుదుచ్చేరి క్యాబినెట్‌కు సైతం క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించింది. త‌న క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులు కంద‌స్వామి, క‌మ‌ల క‌న్న‌న్ క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డార‌ని పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి వీ నారాయ‌ణ‌సామి ప్ర‌క‌టించారు. దాంతో వారిద్ద‌రూ క్వారెంటైన్‌లో ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. 

ఆ మంత్రులిద్ద‌రూ త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగార‌ని, ప‌లువురు అధికారుల‌తో వారు క‌లిసి ప‌నిచేశార‌ని, అందువ‌ల్ల ఆ మంత్రుల‌తో స‌న్నిహితంగా మెలిగిన ప్ర‌జ‌లు, అధికారులు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, ఎవ‌రికి వారు హోమ్ క్వారెంటైన్‌లో ఉండాల‌ని పుదుచ్చేరి సీఎం నారాయ‌ణ‌సామి ట్విట్ట‌ర్‌లో కోరారు. క‌రోనా సోకిన మంత్రులిద్ద‌రూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo