శుక్రవారం 29 మే 2020
National - May 23, 2020 , 17:13:14

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు నక్సల్స్‌ హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు నక్సల్స్‌ హతం

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు నక్సల్స్‌ను పోలీసులు హతం చేశారు. గదిరాస్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మంక్పాల్‌ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ కోసం పోలీసు బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో పోలీసులకు నక్సల్స్‌ తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరు నక్సల్స్‌ మృతి చెందారు. ఘటనాస్థలి నుంచి రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నక్సల్స్‌ను గుందధర్‌, ఐతుగా పోలీసులు గుర్తించారు. గుందధర్‌పై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 


logo