శనివారం 16 జనవరి 2021
National - Nov 27, 2020 , 17:05:27

మరో రెండు తుఫాన్లు వస్తున్నాయ్... !

మరో రెండు తుఫాన్లు వస్తున్నాయ్... !

 ఢిల్లీ :వరుణుడు వణికిస్తున్నాడు. తుఫాన్‌లు పగబడుతున్నాయి. వరస తుఫాన్లు వెంటాడుతున్నాయి. ఇప్పటికే "నివర్ " అతలాకుతలం చేస్తున్నది. నివర్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలతోపాటు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో  కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా మరో అల్పపీడనం సిద్ధంగా ఉందట. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం కాస్తా తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

డిసెంబర్‌ నెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. డిసెంబర్‌2న ‘బురేవి తుఫాన్’ తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రా, రాయలసీమ పై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ‘టకేటి తుఫాన్’ ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించిది. దీని ప్రభావంతో డిసెంబర్‌ 7తేదీన దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.