శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 11:45:52

కరోనాతో మరో ఇద్దరు పోలీసులు మృతి

కరోనాతో మరో ఇద్దరు పోలీసులు మృతి

ముంబయి : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తోంది. కరోనా వైరస్‌ ముంబయి మహా నగరాన్ని అతలాకుతలం చేస్తోంది. మహారాష్ట్రలో అత్యధికంగా 29,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 1,068 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ముంబయిలో కరోనా అలజడి సృష్టిస్తోంది. కరోనాతో ఇద్దరు ఏఎస్‌ఐలు చనిపోయారు. 57 ఏళ్ల అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ శుక్రవారం కరోనాతో మృతి చెందాడు. మరో ఏఎస్‌ఐకి కూడా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో చికిత్స పొందుతున్నాడు. అతను బాత్‌రూమ్‌లోనే కుప్పకూలిపోయాడు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనాతో 11 మంది పోలీసులు చనిపోగా, 8 మంది ముంబయికి చెందిన వారే. logo