ఆదివారం 31 మే 2020
National - May 16, 2020 , 16:37:09

ముంబైలో కరోనాతో మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ మృతి

ముంబైలో కరోనాతో మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌ మృతి


ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. రోజు రోజుకు అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న అధికారులకు కూడా కొవిడ్‌-19 లక్షణాలు బయటపడుతుండటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటివరకు కరోనా విధుల్లో ఉన్న19 మంది కానిస్టబుల్స్‌ మృతిచెందగా.. తాజా ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోవడంతో పోలీస్‌ అధికారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాంతో పోలీసులందరికీ  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 940 కానిస్టేబుల్స్‌ సహా 1140 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు. 

కరోనా  విధుల్లో ఉన్న పోలీసుల్లో కొవిడ్‌-19 లక్షణాలు బయటపడుతుండటంతో 55 ఏండ్లకుపైబడిన పోలీసులు విధులకు రిపోర్ట్‌ చేయాల్సిన అవసరం  లేదని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌సింగ్‌ ప్రకటించారు. అలాగే, 50 ఏండ్లకు పైబడిన ఉద్యోగులకు కేవలం ఆఫీస్‌ విధులనే కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. శనివారం వరకు మహారాష్ట్రలో 29,100 కేసులు నమోదుకాగా, మృతుల సంఖ్య 1,068 కి  చేరింది.


logo