శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 29, 2020 , 17:20:57

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌కు క‌రోనా!

భోపాల్‌: మ‌ధ్య‌‌ప్ర‌దేశ్‌లో మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌కు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంతో హోమ్‌ క్వారెంటైన్‌లో ఉన్నారు. తాజాగా ఆయ‌న క్యాబినెట్‌లోని మ‌రో ఇద్ద‌రు మంత్రులకు కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. జ‌లవనరుల శాఖ మంత్రి తులసీరామ్ సిలావత్, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రామ్‌ఖేలావన్ పటేల్ కరోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. 

జ‌లవనరుల శాఖ మంత్రి తులసీరామ్ సిలావత్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యాన్ని మంగ‌ళ‌వారం రాత్రి ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రామ్‌ఖేలావన్ పటేల్‌కు క‌రోనా సోకిన విష‌యాన్ని భోపాల్ జిల్లా అధికారులు బుధ‌వారం వెల్ల‌డించారు. వారితోపాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి సుహాస్ భ‌గ‌త్ స‌హా ప‌లువురికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.                                        

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo