సోమవారం 25 మే 2020
National - Apr 01, 2020 , 14:41:58

మ‌హారాష్ట్ర‌లో మ‌రో రెండు క‌రోనా మ‌ర‌ణాలు.. 12కు చేరిన మృతులు

మ‌హారాష్ట్ర‌లో మ‌రో రెండు క‌రోనా మ‌ర‌ణాలు.. 12కు చేరిన మృతులు

ముంబై: మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. బుధ‌వారం క‌రోనా బారిన‌ప‌డ్డ మ‌రో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మ‌హారాష్ట్ర‌లో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 12కు చేరింది. కొత్త‌గా న‌మోదైన రెండు మ‌ర‌ణాల్లో ఒక‌రు ముంబైకి చెందిన 75 ఏండ్ల వృద్ధుడు కాగా, మ‌రొక‌రు పాల్గ‌ర్ జిల్లాకు చెందిన 50 ఏండ్ల వ్య‌క్త‌ని మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు తెలిపారు. 

పాల్గ‌ర్ జిల్లాలో ఇప్ప‌టికే న‌లుగురు మృతిచెందారు. ఇప్పుడు మ‌రో వ్య‌క్తి మ‌ర‌ణించ‌డంతో పాల్గ‌ర్ జిల్లాలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5కు పెరిగింది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు వేగంగా పెరుగుతున్న‌ది. బుధ‌వారం ఉద‌యానికి న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 320కి చేరింది. ఇక మ‌రో 39 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి పూర్తిగా కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. 


logo