శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 06, 2020 , 02:12:37

శ్రీనగర్‌లో ఇద్దరు మిలిటెంట్ల హతం

శ్రీనగర్‌లో ఇద్దరు మిలిటెంట్ల హతం
  • ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్‌ వీర మరణం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నగర శివార్లలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు. పరంపొరాలోని షాల్టెంగ్‌ వద్ద తనిఖీ చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై 3 మోటారు సైకిళ్లపై వచ్చిన మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జవాన్‌ రమేశ్‌ రంజన్‌ మరణించాడని సీఆర్పీఎఫ్‌ ప్రతినిధి చెప్పారు. తర్వాత భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారన్నారు. తీవ్రంగా గాయపడి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న మరో మిలిటెంట్‌ను పట్టుకున్నట్లు ఐజీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. పట్టుబడిన మిలిటెంట్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ జమ్ముకశ్మీర్‌ కార్యకర్త ఉమర్‌ ఫయాజ్‌ అని చెప్పారు. మృతులిద్దరు లష్కరే తాయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన వారన్నారు.
logo