శనివారం 30 మే 2020
National - May 21, 2020 , 18:40:16

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు నక్సల్స్‌ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు నక్సల్స్‌ మృతి

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం కూంబింగ్‌ నిర్వహిస్తున్న దంతెవాడ డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డులకు ఇంద్రావతి నది దక్షిణం వైపు నీలవాడ సమీపంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. అవతలివైపు కాల్పులు శబ్ధం ఆగిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారికి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

అదేవిధంగా ఘటనా ప్రాంతంలో రెండు దేశవాలీ తుపాకులు, ఐదు కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టులు ఇద్దరు రిశు ఇస్తమ్‌, మాతాగా గుర్తించినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ చెప్పారు. రిశు ఇస్తమ్‌ ప్లాటూన్‌ నెంబర్‌ 16 డిప్యూటీ కమాండర్‌గా, మాతా పిడియకోట్‌ జన్‌మిలిత కమాండర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసిందని ఎస్పీ పల్లవ్‌ వెల్లడించారు.


logo