సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 12:41:21

సెల్ఫీ పిచ్చి.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న యువ‌తులు.. వీడియో

సెల్ఫీ పిచ్చి.. వ‌ర‌ద‌లో చిక్కుకున్న యువ‌తులు.. వీడియో

భోపాల్ : సెల్ఫీ పిచ్చితో ఓ ఇద్ద‌రు యువ‌తులు ఓ న‌ది మ‌ధ్య‌లో ఉన్న రాళ్ల‌పైకి వెళ్లారు. ఆ ఇద్ద‌రు సెల్ఫీ తీసుకుంటుడ‌గా న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ఇద్ద‌రు వ‌ర‌ద‌లోనే చిక్కుకుపోయారు. ఆ త‌ర్వాత పోలీసులు వారిని ర‌క్షించి ఒడ్డుకు చేర్చారు. ఈ ఘ‌ట‌న మ‌ద్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వారా జిల్లాలోని బేలాఖేడి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

క‌రోనా వ్యాప్తి కార‌ణంగా విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించ‌డంతో యువ‌తీయువ‌కులు ఖాళీగానే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఓ ఎనిమిది మంది అమ్మాయిలు త‌మ గ్రామానికి స‌మీపంలో ఉన్న పెంచ్ న‌ది వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉండ‌డంతో ఎంజాయ్ చేస్తూ ఫోటోల పిచ్చిలో ప‌డిపోయారు. ఓ ఇద్ద‌రు యువ‌తులు న‌దిలో ఉన్న ఓ రాయి వ‌ద్ద‌కు వెళ్లి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇంత‌లోనే న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. ఆ ఇద్ద‌రిని గ‌మ‌నించిన మిగ‌తా అమ్మాయిలు స్థానికుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి యువ‌తులిద్ద‌రిని ర‌క్షించారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఆ ఇద్ద‌రు అమ్మాయిలు పోలీసుల‌కు, స్థానికుల‌కు, ఫ్రెండ్స్‌కు థ్యాంక్స్ చెప్పారు. ముందే వ‌ర్షాకాలం కాబ‌ట్టి చెరువులు, న‌దీ తీర ప్రాంతాల‌కు వెళ్ల‌క‌పోతేనే మంచిది అని పోలీసులు సూచించారు.


logo