శనివారం 16 జనవరి 2021
National - Dec 22, 2020 , 06:58:13

కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు

కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల లొంగుబాటు

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని కుల్‌మాగ్ జిల్లాలోని టోంగ్‌డాంగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్ సందర్భంగా ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ సందర్భంగా వారిని పోలీసులు, సైన్యం అదుపులోకి తీసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాకు చెందిన వారిగా సమాచారం. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు, కాశ్మీర్ పోలీసులు సంయుక్త సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇద్దరు ఉగ్రవాదులు కుటుంబ సభ్యుల విజ్ఞప్తి వారు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా వారి నుంచి రెండు తుపాకులు, మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.