ఆదివారం 29 మార్చి 2020
National - Feb 22, 2020 , 07:18:38

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌: భద్రతా దళాల సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్ర అనంతనాగ్‌ జిల్లా బిజ్‌బెహరాలోని సంగం వద్ద ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.


logo