బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 09, 2020 , 16:08:06

ఆర్మీ ఆయుధాల డిపోలో పేలుడు : ఇద్దరు మృతి

ఆర్మీ ఆయుధాల డిపోలో పేలుడు : ఇద్దరు మృతి

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఆర్మీ ఆయుధాల డిపోలో సోమవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి డిపోలో పని చేస్తున్న ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను ఫయాజ్‌ అహ్మద్‌ భట్‌, గుల్జార్‌ అహ్మద్‌ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన ఫైదా హుస్సేన్‌, షబ్బీర్‌ అహ్మద్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కశ్మీర్‌ వ్యాలీలోని ఖుంద్రూలో అతిపెద్ద ఆయుధాల డిపో ఇదేనని పోలీసులు తెలిపారు. ఇదే డిపోలో 2007లో జరిగిన పేలుళ్లలో పలువురు కార్మికులు మృతి చెందారు. 


logo
>>>>>>