శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 19:18:21

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి..

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి..

హిమాచల్‌ప్రదేశ్‌: వేగంగా ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వివరాలు చూసినైట్లెతే.. హమీర్‌పూర్‌ జిల్లాలోని తౌనీదేవి ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులతో వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి, రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో కారులో పయణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవగా, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారు అంబులెన్సుకు సమాచారమిచ్చి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు.. మృతులకు సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. 


logo