బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 16:41:36

సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు..

సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలు..

కేరళ: కేరళలో ఐయూఎంఎల్‌ పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. ఇటీవలే కేరళకు వచ్చిన ఓ (దుబాయ్) ఎన్‌ఆర్‌ఐకి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ అని నిర్దారణ అయింది. ఎమ్మెల్యే ఎన్‌ఏ నెల్లిక్కున్ను మార్చి 15 ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. అదే పెళ్లికి సదరు ఎన్‌ఆర్‌ఐ వచ్చాడు. దీంతో ఎమ్మెల్యే నెల్లిక్కున్ను సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌ విధించుకున్నారు. మరో ఎమ్మెల్యే ఎంసీ కమరుద్దీన్‌ అదే ఎన్‌ఆర్‌ఐతో కారులో కూర్చొని సెల్ఫీ  దిగాడు. సదరు ఎన్‌ఆర్‌ఐకి కరోనా పాజిటివ్‌ రావడంతో ఎంసీ కమరుద్దీన్‌ కూడా సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌కు పరిమితమయ్యారు. 


logo