సోమవారం 13 జూలై 2020
National - Jun 06, 2020 , 15:33:27

ఇద్దరు న్యాయమూర్తులకు కరోనా

ఇద్దరు న్యాయమూర్తులకు కరోనా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటిసారిగా ఇద్దరు న్యాయమూర్తులకు కరోనా సోకింది. అలీపూర్‌ జిల్లా కోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులకు కరోనా లక్షణాలు రావడంతో అధికారులు వారికి కరోనా పరీక్షలు జరిపారు. పరీక్షల్లో ఇద్దరు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది. దీనితో వారిని కలిసిన వ్యక్తులు అందరినీ గృహ నిర్బంధంలో ఉండాలని సూచించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

అలిపూర్‌ జిల్లాలోని సివిల్‌ సెషన్స్‌ కోర్టులో న్యాయమూర్తులుగా చేస్తున్న వీరిద్దరు ప్రస్తుతం అక్కడే ఒక ప్రైవేట్‌ వైద్య సంస్థలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపిన వారు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లు అనిపించినా వెంటనే కరోనా పరీక్షలకు రావాలంటూ అధికారులు సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటివరకు 4025 యాక్టివ్‌ కరోనా కేసులు ఉండగా. మొత్తం నమోదయిన కేసుల సంఖ్య 7,303గా ఉంది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 72 మంది మరణించారు.


logo