గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 16:26:50

మహారాష్ట్రలో ఎదురు కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి..?

మహారాష్ట్రలో ఎదురు కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి..?

కొత్తగూడెం:  మహారాష్ట్ర దండకారణ్యంలో తుపాకుల మోతమోగింది. భద్రతాబలగాలు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిసింది.  మహారాష్ట్ర గడ్చీరోలి జిల్లా భామర్గఢ్ తహసిల్ పరిధిలోని గుట్టాతానా పోలీస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో అంబుష్ వేసిన మావోయిస్టులు జవాన్లపై మెరుపు దాడికి దిగారు. దీంతో కాస్త ఆలస్యంగా తేరుకున్న జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు దట్టమైన అటవీ మార్గంలోకి కాల్పులు జరుపుతూనే పారిపోయినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనలో ఇద్దరు ఏఎస్‌ఐలు మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo