ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Aug 25, 2020 , 16:04:04

వాహ‌నం అదుపుత‌ప్పి న‌దిలోకి.. ఇద్ద‌రు ఐటీబీపీ సిబ్బంది గ‌ల్లంతు

వాహ‌నం అదుపుత‌ప్పి న‌దిలోకి.. ఇద్ద‌రు ఐటీబీపీ సిబ్బంది గ‌ల్లంతు

కిన్నౌర్‌: హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ఘోరం జ‌రిగింది. ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్‌కు (ఐటీబీపీకి) చెందిన ఇద్ద‌రు సిబ్బంది విధి నిర్వ‌హ‌ణలో భాగంగా ఒక‌‌ వాహ‌నంలో వెళ్తుండ‌గా ప్ర‌మాదానికి గుర‌య్యారు. వారి వాహ‌నం అదుపుత‌ప్పి స‌ట్లెజ్‌ న‌దిలో ప‌డి కొట్టుకుపోయింది. ఈ ప్ర‌మాదంలో ఆ వాహ‌నంలోని ఐటీబీపీ సిబ్బంది ఇద్ద‌రూ గ‌ల్లంత‌య్యారు. కిన్నౌర్ జిల్లాలోని స్పైలో ప్రాంతం వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. కిన్నౌర్ ఎస్పీ ఎస్ఆర్ రాణా ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 

ఈ ప్ర‌మాదంలో గ‌ల్లంతైన ఇద్ద‌రు ఐటీబీపీ సిబ్బందిలో ఒకరు అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌కు చెందిన రైఫిల్ మ్యాన్ నీమా ధోన్‌ధ‌ప్ కాగా, మ‌రో వ్య‌క్తి ఐటీబీపీలో డ్రైవ‌ర్ అని పోలీసులు తెలిపారు. అయితే న‌దిలో కొట్టుకుపోయిన వాహ‌నం ఒక బండ‌ను తాకి ఆగిపోగా, సిబ్బంది ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo