ఆదివారం 24 జనవరి 2021
National - Dec 17, 2020 , 09:23:21

పంజాబ్‌లో ఇద్దరు చొరబాటుదారుల హతం

పంజాబ్‌లో ఇద్దరు చొరబాటుదారుల హతం

అట్టారి: పంజాబ్‌ సరిహద్దుల్లో దేశంలోకి అక్రమంగా చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదు లను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) మట్టుపెట్టింది. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో అట్టారి సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు ఆపడానికి ప్రయత్నించా యని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే వారు కాల్పులు జరిపారని, దీంతో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో హతమయ్యారని వెల్లడించారు. వారివద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈనేపథ్యంలో అట్టారి సరిహద్దుల్లో గాలింపు ముమ్మరంగా కొనసాగుతున్నదని చెప్పారు.

కాగా, జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ సమీపంలో ఉన్న గుండ్‌బాబా ఖలీల్‌ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయని కశ్మీర్‌జోన్‌ పోలీసులు తెలిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది గాయపడ్డాడని, అతన్ని అరెస్టు చేశామన్నారు. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించామని వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. 


logo