శనివారం 28 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 17:34:35

పటాకుల విక్రయానికి రెండు గంటలు అనుమతి : సీఎం ఖట్టర్‌

పటాకుల విక్రయానికి రెండు గంటలు అనుమతి : సీఎం ఖట్టర్‌

హర్యానా :  దీపావళి సందర్భంగా రాష్ట్రంలో పటాకుల విక్రయానికి రెండు గంటలపాటు అవకాశం ఇస్తున్నట్లు హర్యానా సీఎం ఎంఎల్‌ ఖట్టర్‌ తెలిపారు. వాతావరణ కాలుష్యంతో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉన్నందున పటాకుల విక్రయానికి, కాల్చే వారికి కేవలం రెండు గంటలు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పటాకులు విక్రయించుకోవాలనుకునే వారు నిర్దేశించిన సమయంలో విక్రయించుకోవచ్చని సీఎం చెప్పారు. ఇదిలాఉండగా ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తిస్థాయి నిషేధం విధించాయి. నిబంధనలు అతిక్రమించి పటాకులు పేల్చిన వారికి జరిమానా సైతం విధిస్తాయని హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలో పటాకుల విక్రేతలు ప్రభుత్వాల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు నిబంధనల మేరకు తాము ఈ సారి పర్యావరణ హిత పటాకులను తయారు చేశామని, అయినా నిషేధం విధించడం ఏంటని మండిపడుతున్నారు. ప్రభుత్వాల నిర్ణయం కారణంగా పరిశ్రమపై ఆధారపడి జీవించే వారు రోడ్డున పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.