ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 22:13:09

నెమ‌ళ్ల వేట.. ఇద్ద‌రు అరెస్ట్‌!

నెమ‌ళ్ల వేట.. ఇద్ద‌రు అరెస్ట్‌!

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నెమ‌ళ్ల‌ను వేటాడుతున్న ఇద్ద‌రు వ్యక్తుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ‌నివారం తెల్ల‌వారుజామున ధ‌నాడి అట‌వీ ప్రాంతంలో ఇద్ద‌రు వ్య‌క్తులు నెమ‌ళ్ల‌ను వేటాడుతున్న‌ట్లు స‌మాచారం అందుకున్న సువాస‌ర పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి వెళ్లి నిందితుల‌న అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక 12-బోర్ తుపాకీ, రెండు బుల్లెట్లు, ఒక వాహ‌నంతోపాటు ఒక మ‌ర‌ణించిన నెమ‌లిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సులేమాన్ ఖాన్ (35), కాలే ఖాన్ (65)ల‌పై వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ట్టం-1972 కింద కేసు న‌మోదు చేశారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo