శనివారం 30 మే 2020
National - May 08, 2020 , 15:06:53

రెండు తలల పాము.. వీడియో వైరల్‌

 రెండు తలల పాము.. వీడియో వైరల్‌

రెండు త‌ల‌ల పాటు అంటే ముందు ఒక త‌ల‌, వెనుకొక త‌ల‌. ఇది మాత్ర‌మే చాలామందికి తెలుసు. ఒడిశాలో క‌నిపించిన ఈ పాముకి త‌ల ప్రాంతంలో రెండు త‌ల‌లు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ రెండు త‌ల‌ల పాము విష‌పూరిత‌మైన‌ది. రెండు త‌ల‌లు ఉండ‌డంతో దీనికి నాలుగు క‌ళ్లు, రెండు నాలుక‌లు ఉన్నాయి. శ‌రీరం ఒక‌టే అయినా రెండు త‌ల‌ల వేరు వేరుగా ప‌నిచేస్తున్నాయి. ఆహారం కోసం ఈ రెండు త‌ల‌లు వేర్వేరుగా వెతుకులాట మొద‌లుపెడుతాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

ఈ వీడియోలో పాము నేల మీద పాకుతుండ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ పాము ఒడిశాలోని కియోంజార్ జిల్లా అట‌వీ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో గుర్తించారు. త‌ర్వాత ఈ పామును సుర‌క్షితంగా అడ‌విలో వ‌దిలేశార‌ని సుశాంత నంద పేర్కొన్నారు.logo