బుధవారం 08 జూలై 2020
National - Jun 21, 2020 , 13:07:46

ల‌బ్ధిదారుల జాబితాలో పేరుంది.. మంజూరైన ఇల్లు ఏమ‌య్యింది?

ల‌బ్ధిదారుల జాబితాలో పేరుంది.. మంజూరైన ఇల్లు ఏమ‌య్యింది?

రాయ్‌పూర్‌: పేద ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం ప్ర‌భుత్వాలు ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు చేప‌డుతాయి. ఆయా ప‌థ‌కాల‌కు సంబంధించి ప్ర‌సారమాధ్య‌మాల్లో జోరుగా ప్ర‌చారం చేస్తాయి. కానీ చాలామటుకు ఆ ప‌థ‌కాల‌కు సంబంధించిన ఫ‌లాలు మాత్రం ల‌బ్ధిదారుల‌కు చేర‌వు. పేద‌ల ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకుని గ‌ల్లీ లీడ‌ర్లుగా చెలామ‌ణి అయ్యే కొంద‌రు ద‌ళారులు తప్పుడు ల‌బ్దిదారుల పేర్ల‌ను సృష్టించి ప్ర‌భుత్వ నిధుల‌ను దారిమ‌ళ్లిస్తారు. క్షేత్రస్థాయిలో ఉండే కొంత‌మంది లంచ‌గొండి అధికారులువ‌ల్ల ఈ దళారులు ఆడిందే ఆట‌, పాడిందే పాట అన్న‌ట్లుగా వ్య‌వ‌హారం ఉంటుంది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజన ప‌థ‌కం కింద ఇటీవ‌ల పెండ్ర జిల్లాకు చెందిన‌ ప‌లువురికి ఇండ్లు కేటాయించారు. అయితే, జిల్లాలోని రెండు కుటుంబాల పేర్లు ల‌బ్ధిదారుల‌ జాబితాలో ఉన్నా ఇండ్లు మాత్రం ఇవ్వ‌లేదు. దీనిపై బాధితులు జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేయ‌గా.. దీనిపై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని పెండ్ర డిప్యూటీ క‌లెక్ట‌ర్ సింగ్ సంబంధిత అధికారుల‌ను ఆశ్ర‌యించారు. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సింగ్ చెప్పారు.logo