బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 19:01:24

ఏనుగులు ఇలా కూడా చేస్తాయా..? ..వీడియో

ఏనుగులు ఇలా కూడా చేస్తాయా..? ..వీడియో

బెంగ‌ళూరు: మ‌న‌కు కంట్లో న‌ల‌త‌ప‌డితే అది బ‌య‌టికి వ‌చ్చేవ‌ర‌కు న‌ర‌కం అనుభ‌వించాల్సి వ‌స్తుంది. పండ్ల మ‌ధ్య‌లో ఏదైనా ఇరుక్కుంటే దాన్ని తీసేవ‌ర‌కు కుదురుగా ఉండ‌లేం. చెవిలో దుర‌ద‌పెడితే కెళుక్కోకుండా ఏది తోయ‌దు. పాపం మ‌రి జంతువుల‌కు ఇలాంటి స‌మ‌స్య‌లే ఎదురైతే.. ఆ స‌మ‌స్య‌లు వాటిక‌వే తొల‌గిపోయే వ‌ర‌కు బాధ‌ను అనుభ‌వించ‌డం త‌ప్ప మ‌రేమీ చేయ‌లేవు. 

కానీ క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరు స‌మీపంలోని బ‌న్నెర్‌ఘ‌ట్ట బ‌యాల‌జిక‌ల్ పార్కులోని ఏనుగులు మాత్రం అచ్చం మ‌నుషుల్లాగే చెవిలో దుర‌ద పెడితే పుల్ల‌ల‌తో కెళుక్కుంటున్నాయి. పండ్ల మ‌ధ్య ఏదైనా ఇరుక్కుంటే పుల్లల‌తో తీసుకుంటున్నాయి. ఒంటిపై దురుద పెడితే పుల్ల‌ల‌తోనే గోక్కుంటున్నాయి. కాక‌పోతే మ‌నం చేతి సాయంతో పుల్లలు ప‌ట్టుకుంటే, అవి తొండంతో ప‌ట్టుకుంటున్నాయి. అదొక్క‌టే తేడా. కావాలంటే మీరు ఈ కింది వీడియో చూడండి ఏనుగుల తొండలాఘ‌వం ఎంత గొప్ప‌దో అర్థ‌మ‌వుతుంది.      ‌ 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo