గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 11:09:57

ఏనుగు ప్ర‌య‌త్నంతో.. బిడ్డ‌ను కాపాడుకున్న‌ది!

ఏనుగు ప్ర‌య‌త్నంతో.. బిడ్డ‌ను కాపాడుకున్న‌ది!

అనుకోకుండా న‌దిలో ప‌డిన పిల్ల ఏనుగును బ‌య‌ట‌కు తీసేందుకు త‌ల్లి ఏనుగు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌రికి త‌న వ‌ల్ల కాక‌పోవ‌డంతో మ‌రొక ఏనుగు స‌హాయం తీసుకున్న‌ది. ఈ రెండు ఏనుగులు క‌లిసి పిల్ల ఏనుగును ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌కు తీశాయి. ఈ సంఘ‌ట‌న భూటాన్ బార్డ‌ర్ వ‌ద్ద చోటు చేసుకున్న‌ది. ప్ర‌య‌త్నం చేస్తే సాధించ‌లేనిది ఏదీ లేదన్న‌ట్టు ఈ వీడియో తెలియ‌జేస్తున్న‌ది. అందుకే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది.

29 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట‌ర్‌లో షేర్ చేశారు. "ఏనుగులు కుటుంబ బంధంలో బలమైనవి. తల్లి, ఆంటీలిద్ద‌రు క‌లిసి పిల్ల ఏనుగును రివ‌ర్ నుంచి బయటపడటానికి సహాయం చేస్తాయి" అని సుశాంత నందా శీర్షిక‌లో జోడించారు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో కామెంట్లు పెట్టేందుకు నెటిజ‌న్లు ఉత్సాహం చూపుతున్నారు.  

 

 

తాజావార్తలు


logo