బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 16, 2020 , 19:22:34

అసోంలో రెండు సార్లు కంపించిన భూమి

అసోంలో రెండు సార్లు కంపించిన భూమి

గౌహతి/షిల్లాంగ్ : అసోంలో గురువారం రెండు సార్లు భూమి కంపించిందని, వీటి ప్రభావం పొరుగున ఉన్న మేఘాలయ వరకు కనిపించిందని అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. ఉదయం 7.57 గంటల ప్రాంతంలో రిక్టర్‌ సేలుపై 4.1 తీవ్రతతో కరీంగంజ్‌ ప్రాంతంలో నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెయిస్మాలజీ తెలిపింది. భూమికి 18 కిలోమీటర్ల దిగువన భూపంక కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం మేఘాలయవ్యాప్తంగా కనిపించింది. షిల్లాంగ్, పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో బలమైన ప్రకంపనలు చోటు చేసుకుని ఉన్నాయని అధికారులు చెప్పారు.

రెండోసారి మధ్యాహ్నం 1.09గంటలకు భూమి కంపించిందని, పశ్చిమ అసోం కోక్రాజర్‌లో భూమికి 11 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రకంపనలు 2.6గా నమోదయ్యాయని, దీని ప్రభావం పశ్చిమ మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిందని, నష్టం జరిగినట్లుగా ఎలాంటి సమాచారం అందలేని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా భూకంపాలు చోటు చేసుకుంటుండగా, గత నెలలో వరుస ప్రకంపనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. వాటిలో ఎక్కువగా మిజోరంలో ఉన్నాయని, దీంతో చంపాయ్ జిల్లాలో నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo