మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 17:30:31

యూపీలో కారు టైరు పేలి ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం.. ముగ్గురికి గాయాలు

యూపీలో కారు టైరు పేలి ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం.. ముగ్గురికి గాయాలు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఉన్న‌వ్ జిల్లాలో ఆగ్రా-ల‌క్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. కారు టైరు పేల‌డంతో అది అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న ఉన్న గుంత‌లో బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో కారులోని ఇద్ద‌రు ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాద స‌మాచారం అందిన వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఉన్న‌వ్ జిల్లా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

చ‌నిపోయిన ఇద్ద‌రి మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టానికి పంపించారు. మృతులు బీహార్‌లోని స‌మ‌స్తిపూర్ జిల్లాకు చెందిన మీరా దేవి (53), జ‌య్‌ప్ర‌కాష్ (40)గా పోలీసులు గుర్తించారు. మృతులు ఢిల్లీ నుంచి బీహార్‌లోని స‌మ‌స్తిపూర్‌కు వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు. కారు చాలా పాత‌ద‌ని, యూపీలోని ఆగ్రా-ల‌క్నో ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్తుండ‌గా ఒక్క‌సారిగా ముందు టైరు పేల‌డంతో అదుపుత‌ప్పి గోతిలో ప‌డింద‌ని పోలీసులు వెల్ల‌డించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.