శనివారం 06 జూన్ 2020
National - May 22, 2020 , 22:46:02

పెళ్లైన రెండో రోజే వ‌ధువుకు క‌రోనా!

పెళ్లైన రెండో రోజే వ‌ధువుకు క‌రోనా!

క‌రోనా ఇంకెంత‌మందిని విడ‌దీస్తుందో. ఇప్ప‌టికే ఫ్రెండ్స్, ఇరుగుపొరుగు వారిని దూరం చేసింది. అది చాల‌దు అన్న‌ట్లు ఇంటికి వ‌చ్చిన అతిథుల‌ను కూడా దూరం చేసింది ఎలా అంటారా..

మే 19న పెళ్లి చేసుకున్న ఓ జంట కాపురానికి సిద్ధ‌మ‌వుతున్న వేళ .. పెళ్లికూత‌రుకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ స‌మీపంలో జ‌ట్ ఖేడి ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో వ‌ధూవ‌రుల కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు పెళ్లికి హాజ‌రైన 32 మందిని క్వారెంటైన్‌కు త‌ర‌లించారు. 

పెళ్లికి ముందునుంచే యువ‌తి ద‌గ్గు, జ్వ‌రంతో బాధ ప‌డుతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. జ్వ‌రం త‌గ్గ‌డానికి మాత్ర‌లు వేసుకొని ఆమె పెళ్లి పీట‌ల‌పై కూర్చున్న‌ట్లు వెల్ల‌డైంది. ఆ త‌ర్వాత జ్వ‌రం కొంచెం త‌క్కువ కావ‌డంతో హాస్పిట‌‌ల్‌కు తీసుకెళ్లారు. ఆమెకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ అని తేలింది.


logo