బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 12:37:49

ముంబైలో పోలీసుల కోసం రెండు కరోనా వైద్యకేంద్రాలు

ముంబైలో పోలీసుల కోసం రెండు కరోనా వైద్యకేంద్రాలు

హైదరాబాద్: ముంబైలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యం ప్రజల మధ్య విధులు నిర్వహించే పోలీసులకు కూడా కరోనా సోకుతున్నది. అందువల్ల ప్రత్యేకించి పోలీసుల కోసం ముంబైలో రెండు కరోనా వైద్యచికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతాక్రూజ్‌లో 300 పడకలు, మారోల్‌లో 250 పడకల ఆస్పత్రులు ప్రత్యేకించి పోలీసు సిబ్బంది కోసం పనిచేస్తాయి. పౌర దవాఖానాలపై వత్తిడి తగ్గించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్టు అదికారులు తెలిపారు. బృహన్‌ముంబై మునిసిపల్ కార్పోరేషన్ సహకారంతో వీటిని నిర్వహిస్తారు. శాంతాక్రుజ్, మారోల్ కేంద్రాలు లక్షణాలు బయటపడని పోలీసు సిబ్బందికి మాత్రమేనని జాయింట్ పోలీసు కమిషనర్ (అడ్మిన్), నగర పోలీసుల ఆరోగ్య వ్యవ హారాల నోడల్ ఆఫీసర్ అయిన నవల్ బజాజ్ చెప్పారు. కరోనాతో ఓమోస్తరుగా జబ్బుపడ్డ పోలీసు కుటుంబాలవారికి కూడా వీటిలోమనే చికిత్స చేస్తారని ఆయన వివరించారు. మహారాష్ట్ర పోలీసుల్లో 547 మంది కానిస్టేబుళ్లకు, 71 మంది అధికారులకు కరోనా సోకింది. వారిలో ఐదుగురు కానిస్టేబుళ్లు మరణించారు. ఒక్క ముంబైలోనే 309 మంది పోలీసులకు కరోనా పాజిటివ్  వచ్చింది.


logo