ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 16:55:03

ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌

ఛండీగఢ్‌:  పంజాబ్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారని రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌  ఆదివారం తెలిపారు. వీరిద్దరూ కూడా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 'నా సహచర ఎమ్మెల్యేలు బల్విందర్‌ సింగ్‌, ధరంభీర్‌ అగ్నిహోత్రిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిద్దరూ త్వరగా  కోలుకోవాలని ఆ  కోరుకుంటున్నానని' సీఎం ట్వీట్‌ చేశారు. 

ఇటీవల కేబినెట్‌ మంత్రి రాజిందర్‌ సింగ్‌ బాజ్వాకు కరోనా  సోకిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ తొలి మంత్రి ఆయనే.  ఆ తర్వాత మంత్రి కుటుంబసభ్యులకు పరీక్షలు   నిర్వహించగా తన భార్య, తనయుడికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.  గత  కొన్నిరోజులుగా పంజాబ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,792 కరోనా పాజిటివ్‌  కేసులు నమోదు కాగా, 246 మంది చనిపోయారు. 


logo