బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 10, 2020 , 13:57:12

బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు హతం

బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు హతం

ఛత్తీస్‌గఢ్‌ : బీజాపూర్‌ జిల్లాలోని ఇరపల్లి గ్రామ సమీపంలో మావోయిస్టులకు, కోబ్రా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మావోయిస్టును కోబ్రా దళాలు హతం చేశాయి. బీజాపూర్‌ జిల్లాలో 204 బెటాలియన్‌కు చెందిన కోబ్రా దళాలు.. మావోయిస్టుల ఏరివేతకు కూంబింగ్‌ చర్యలు చేపట్టాయి. ఇరపల్లి గ్రామ సమీపంలో జవాన్ల కూంబింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. logo