సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 01:25:58

గ్రహశకలాన్ని కనిపెట్టిన బాలికలు

గ్రహశకలాన్ని కనిపెట్టిన బాలికలు

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఇద్దరు బాలికలు భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహశకలాన్ని కనుగొన్నారు. ఈ విషయాన్ని నాసా స్వయంగా ధ్రువీకరించింది. వైదేహి, రాధిక ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. ఇటీవల స్పేస్‌ ఇండియా నిర్వహించిన ‘ఆల్‌ ఇండియా ఆస్టరాయిడ్‌ సెర్చ్‌ కాంపెయిన్‌ 2020’ రెండు నెలల కాంపెయిన్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు హవాయిలోని పాన్‌ స్టార్‌ టెలిస్కోపు సాయంతో గ్రహశకలాన్ని గుర్తించారు. 


logo