మంగళవారం 07 జూలై 2020
National - Jun 16, 2020 , 14:34:26

కారు డోర్స్‌ లాకై ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

కారు డోర్స్‌ లాకై ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కారు డోర్స్‌ లాక్‌ అయి ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. నాలుగు నుంచి ఏడేళ్ల వయస్సు గల నలుగురు చిన్నారులు ఈ ఉదయం 8 గంటలకు ఆడుకుంటూ కారులోకి ఎక్కారు. ఆడుకునేక్రమంలో కారు డోర్స్‌ను వాళ్లంతటవాళ్లు లాక్‌చేసుకున్నారు. దీంతో ఊపిరాడక అపస్మారకస్థితిలోకి వెళ్లారు. గమనించిన వెంటనే నలుగురు చిన్నారులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పిల్లలు చనిపోగా మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.


logo