శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 11, 2020 , 17:06:15

సింహాల లెవ‌ల్లో పోరాడిన రెండు పిల్లు‌లు.. చివ‌రికీ పై నుంచి కింద‌కి వ‌దిలేసింది!

సింహాల లెవ‌ల్లో పోరాడిన రెండు పిల్లు‌లు.. చివ‌రికీ పై నుంచి కింద‌కి వ‌దిలేసింది!

రెండు పిల్లులు పైక‌ప్పు మీద పోరాడుతున్నాయి. ఈ వీడియోను ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ రెండింట్లో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు దీనిని 'ది ల‌య‌న్ కింగ్' అంటూ త‌మ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పిల్లుల పోరాటం 'ది ల‌య‌న్ కింగ్‌'లో ముఫాసా, అత‌ని సోద‌రుడు స్కార్ మ‌ధ్య జ‌రిగిన విషాద దృశ్యాన్ని చాలా పోలి ఉంటుంది. ముఫాసాను ఒక్క‌సారిగా చంప‌డానికి కుట్ర చేస్తుంది. ముఫాసా అంచున వేలాడుతూ త‌న‌ను ర‌క్షిస్తాడ‌ని అత‌ని క‌ళ్ళ‌లోకి ఆశ‌గా అత‌నిని చూస్తుంది. కానీ చివ‌రికి ముఫాసాను వ‌దిలేయ‌డంతో కింద ప‌డిపోతుంది. అచ్చం అలానే ఈ సంఘ‌ట‌న కూడా జ‌రిగింది.

ఈ వీడియోకు సంగీతం కూడా యాడ్ చేసి పోస్ట్ చేశారు. ఒక‌వైపు పిల్లుల పోరాటం, మ‌రోవైపు 'ది ల‌య‌న్ కింగ్' రెండింటినీ గుర్తు చేసేలా స‌న్నివేశాన్ని డిజైన్ చేశారు. 'వారు ప్ర‌ధాన పాత్ర పొందార‌ని నేను అనుకుంటున్నాను' అనే క్యాప్ష‌న్ స్పానిష్ భాష‌లో జోడించారు. ఆరోన్ కోయిస్కో అనే ట్విట‌ర్ యూజ‌ర్ అదే వీడియోను మైక్రోబ్లాగింగ్ సైట్‌లో పోస్ట్ చేశారు. ఇది సుమారు 17 వేల వీక్ష‌ణ‌ల‌ను సంపాదించింది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.