శుక్రవారం 22 జనవరి 2021
National - Jan 14, 2021 , 17:45:20

జల్లికట్టులో నల్లజెండాలు.. పోలీసుల అదుపులో ఇద్దరు

జల్లికట్టులో నల్లజెండాలు.. పోలీసుల అదుపులో ఇద్దరు

చెన్నై: తమిళనాడులోని మదురైలో పొంగల్ సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టులో పాల్గొన్న ఇద్దరు నల్లజెండాలు ప్రదర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గమనించిన పోలీసులు నల్ల జెండాలు ప్రదర్శించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మదురైలోని పొంగల్‌ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన జరిగింది. 


తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీకి బాసటగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థిస్తున్నది. దీంతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, నినాదాలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo