శనివారం 30 మే 2020
National - May 20, 2020 , 11:39:49

ఎలుగుబంట్లు ఎలా బయట పడ్డాయో చూడండి!

ఎలుగుబంట్లు ఎలా బయట పడ్డాయో చూడండి!

ఎన్నో తెలివితేటలు ఉన్న మనిషి బావిలో పడితేనే బయట పడలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటిది ఈ ఎలుగుబంట్లు ఎంతో సమయస్ఫూర్తితో బయటపడ్డాయి. అదెలా అంటే..

 అనుకోకుండా రెండు ఎలుగుబంట్లు బావిలో పడ్డాయి. ఇవి బయట పడేందుకు మార్గం లేక నీటిలోనే  గిలగిలా కొట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని గోండియాలో సాలెకాసా రేంజ్‌కు చెందిన అధికారులు బావిలో పడ్డ ఎలుగుబంట్లను కాపాడే ప్రయత్నం చేశారు. వాటిని బయటకి తీసేందుకు ఒక నిచ్చెనను ఏర్పాటు చేశారు. పైనుంచి కిందకి నీటికి తాకేలా నిచ్చెన వేశారు. దాన్ని పట్టుకొని అలవోకగా ఎలుగుబంట్లు బయట పడ్డాయి. 41 సెకండ్లపాటు నడిచే ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పొస్ట్‌ చేశాడు. కొవిడ్‌-19తో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో ఊరటనిస్తుంది అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. వీడియో చూసినవారంతా హమ్మయ్యా అంటూ కామెంట్లు పెడుతున్నారు. logo