సోమవారం 13 జూలై 2020
National - May 06, 2020 , 18:31:21

ఢిల్లీలో అక్ర‌మ మ‌ద్యం త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు అరెస్ట్‌

ఢిల్లీలో అక్ర‌మ మ‌ద్యం త‌ర‌లిస్తున్న ఇద్ద‌రు అరెస్ట్‌

ఢిల్లీ:  దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తున్న ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అంబేద్క‌ర్‌న‌గ‌ర్ ప్రాంతానికి చెందిన‌ మినీ ట్ర‌క్కు డైవ‌ర్ న‌బీన్ చంద్ర‌బ‌ట్‌(32), క్లీన‌ర్ రాహుల్‌(30)ల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. క‌రోల్‌బాగ్‌లోని ప్రైజ్ రోడ్డులో ఆనంద్ ప‌ర్వ‌త్ వైపు నుంచి వ‌స్తున్న మినీ ట‌క్కును త‌నిఖీ చేయ‌గా, పాల డ‌బ్బాల మ‌ధ్య 56 కార్ట‌న్‌ల అక్ర‌మ మ‌ద్యం దొరికిందని డిప్యూటీ పోలీస్ క‌మిష‌న‌ర్ సంజ‌య్ భాటియా తెలిపారు. న‌బీన్ భ‌ట్ టాక్సీ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసేవాడు. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నిలేక‌పోవ‌డంతో మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేయ‌డం ప్రారంభించిన‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డించాడు. అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రాల‌కు ముఖ్య సూత్ర‌దారి అంబేద్క‌ర్‌న‌గ‌ర్‌కు చెందిన అమిత్‌గా గుర్తించారు. త్వ‌ర‌లోనే అత‌డిని అదుపులోకి తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు. 


logo