గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 13:08:12

లడఖ్‌ నదిలో మునిగి ఇద్దరు ఆర్మీ సైనికులు మృతి

లడఖ్‌ నదిలో మునిగి ఇద్దరు ఆర్మీ సైనికులు మృతి

లడఖ్‌ :  లడఖ్‌లోని శ్యోక్‌ నదిలో మునిగి ఇద్దరు భారత ఆర్మీ సైనికులు మృతి చెందారు. వంతెనపై నిర్మాణ పనులు జరుగుతుండగా మహారాష్ట్రలోని మాలెగావ్‌కు చెందిన నాయక్‌ సచిన్‌ మోర్‌, పంజాబ్‌లోని పాటియాలా కు చెందిన లాన్స్‌ నాయక్‌ సలీం ఖాన్‌ అనే సైనికులు ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించారు.  కొద్ది రోజుల క్రితం లడఖ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృత్యువాడ పడిన సంఘటన తెలిసిందే.

గత కొన్నిరోజులుగా లడఖ్‌లో చైనాతో జరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా భారత్‌ పెద్ద ఎత్తున దళాలను మోహరించింది. చైనాకు తగిన సమాధానం ఇవ్వడానికి భారత్‌ సన్నాహాలు ప్రారంభించింది. భారత్‌, చైనా మధ్య ఘర్షణతో సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లడఖ్‌లో కమ్యూనికేషన్‌ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా భారత్‌ ప్రయత్నాలు చేస్తోంది. లడఖ్‌లోని గాల్వన్‌ వాలె, చుషుర్‌ వంటి ప్రాంతాల్లో  ఫోన్‌ టెర్మినల్స్‌ ఏర్పాటు చేయబడ్డాయి. చైనాకు తగిన సమాధానం ఇచ్చేందుకు భారత్‌ లైన్‌ ఆఫ్‌ యాక్జువల్‌ (ఎల్‌ఐసీ)లో రక్షణ క్షిపణి వ్యవస్థలను మోహరించింది. 


logo