గురువారం 02 జూలై 2020
National - Jun 22, 2020 , 17:15:08

ఒకేచోట‌ రెండు ప్ర‌మాదాలు.. ప‌లువురికి గాయాలు

ఒకేచోట‌ రెండు ప్ర‌మాదాలు.. ప‌లువురికి గాయాలు

ల‌క్నో: ఆగ్రా-ల‌క్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని ఒకే ప్రాంతంలో సోమ‌వారం రెండు వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. న‌గ్లా బెహ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ఏరియాలో జ‌రిగిన ఆ రెండు ప్ర‌మాదాల్లో ప‌లువురికి గాయాల‌య్యాయి. మొద‌టి ప్ర‌మాదం సోమ‌వారం అర్ధ‌రాత్రి ఒంటి గంట‌కు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి వెళ్తున్న బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. 

స‌మాచారం అందిన వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు క్ష‌తగాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదంలో బ‌స్సు డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ స‌హా ప‌లువురు ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. అనంత‌రం ఉద‌యం ఆరు గంట‌ల స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురైన ఆ రెండు వాహ‌నాలను మ‌రో రెండు ట్ర‌క్కులు ఢీకొట్టాయి. ఈ ప్ర‌మాదంలో కూడా రెండు ట్ర‌క్కుల డ్రైవ‌ర్లు గాయ‌ప‌డ్డారు.       
logo