మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Sep 03, 2020 , 08:52:29

ప్ర‌ధాని మోదీ ప‌ర్స‌న‌ల్ ట్విటర్‌ ఖాతా‌ హ్యాక్‌..

ప్ర‌ధాని మోదీ ప‌ర్స‌న‌ల్ ట్విటర్‌ ఖాతా‌ హ్యాక్‌..

హైద‌రాబాద్‌: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి చెందిన ప‌ర్స‌న‌ల్ ట్విటర్‌‌ అకౌంట్ హ్యాక్ అయ్యింది.  ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ సంస్థ ద్రువీక‌రించింది. జాతీయ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టోక‌రెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వ‌వ‌చ్చు అని ఆ పేజీలో ట్వీట్లు క‌నిపించాయి. దీంతో ప్ర‌ధాని అకౌంట్ హ్యాక్ అయిన‌ట్లు ద్రువీక‌రించారు. అయితే మోదీ అకౌంట్‌ను సెక్యూర్ చేసిన‌ట్లు కూడా ట్విట్ట‌ర్ సంస్థ వెల్ల‌డించింది. ట్విట్ట‌ర్ సంస్థ ప్ర‌తినిధి ఈ సంఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. హ్యాకింగ్ గురించి తెలుసుకున్నామ‌ని, అకౌంట్‌ను మ‌ళ్లీ సెక్యూర్ చేశామ‌ని, ఈ సంఘ‌ట‌న‌ను నిరంతరం ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, అయితే ప్ర‌ధానికి చెందిన ఇత‌ర అకౌంట్లపై ప్ర‌భావం ప‌డిందా అన్న విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని అన్నారు.  న‌రేంద్ర మోదీ(@narendramodi_in.) అకౌంట్‌పై పోస్టు చేసిన ట్వీట్ల‌కు సంబంధించి ప్ర‌ధాని కార్యాల‌యం ఇంకా స్పందించ‌లేదు. 

ప్ర‌ధాని ట్విట్ట‌ర్ అకౌంట్‌కు సుమారు 2.5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు.  మోదీ ప‌ర్స‌న‌ల్ వెబ్‌సైట్‌, న‌రేంద్ర మోదీ మొబైల్ అప్లికేష‌న్‌ను కూడా ఆ అకౌంట్ హ్యాండిల్ చేస్తుంది. ప్ర‌ధాని మోదీ ట్విట్ట‌ర్ అకౌంట్ మాత్రం హ్యాక్ కాలేద‌న్నారు.  దానికి సుమారు 61 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. క్రిప్టోక‌రెన్సీ ప‌ద్ధ‌తితో విరాళాలు ఇవ్వాలంటూ వ‌చ్చిన ట్వీట్ల‌ను ప్ర‌స్తుతం తొల‌గించారు.  ఇటీవ‌లే అనేక మంది ప్ర‌ముఖుల ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాక్ అయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ అకౌంట్‌ను కూడా సైబ‌ర్ నేర‌గాళ్లు హ్యాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. జూలై నెల‌లో టెక్నాల‌జీ దిగ్గ‌జాలు, రాజ‌కీయ‌వేత్త‌లు, సెల‌బ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. 

బ‌రాక్ ఒమాబా, జోసెఫ్ బైడెన్‌, మైక్ బ్లూమ్‌బ‌ర్గ్‌, జెఫ్ బేజోస్‌, బిల్ గేట్స్‌, ఎల‌న్ మ‌స్క్‌, కెయిన్ వెస్ట్‌, కిమ్ క‌ర్దాసిన్ లాంటి ప్ర‌ముఖుల ట్విట్ట‌ర్ అకౌంట్లు హ్యాక్ అయిన విష‌యం తెలిసిందే. వెయ్యి డాల‌ర్ల క్రిప్టోక‌రెన్సీ పంపిస్తే.. దానికి రెండు వేల డాల‌ర్ల క‌రెన్సీ ఇవ్వ‌నున్న‌ట్లు బోగ‌స్ ట్వీట్లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.