మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 21:38:22

క‌వ‌ల‌లు.. రూపంలోనే కాదు చ‌దువులోనూ సేమ్ టు సేమ్‌!

క‌వ‌ల‌లు.. రూపంలోనే కాదు చ‌దువులోనూ సేమ్ టు సేమ్‌!

క‌వ‌ల పిల్ల‌లు అన‌గానే మ‌న‌కు ట‌క్కున హ‌లో బ్ర‌ద‌ర్ సినిమా గుర్తుకు వ‌స్తుంది. అందులో ఒక నాగార్జున హుషారుగా ఉంటే మ‌రొక‌రు కాస్త అమాయ‌కంగా ఉం‌టారు. ఒక‌రు ఏడిస్తే మ‌రొక‌రు బాధ‌ప‌డుతారు. ఇలా ఒక‌రికి చ‌దువు అబ్బితే మ‌రొక‌రికి అద‌ర్ మాక్టివిటీస్ అబ్బుతాయి. ఇలా ప్ర‌తీ దాంట్లో వేర్వేరు అభిరుచులు క‌లిగుంటారు. ఒక్క రూపంలో త‌ప్ప. కానీ వీరు మాత్రం రూపంలోనే చ‌దువు గొంతు, చ‌దువులోనూ ఒకేలా రానిస్తున్నారు. ఏ క్లాస్‌లో అయినా సేమ్ మార్కుల‌తో పాస్ అవుతున్నారు.

మానసి, మాన్య అనే ఈ కవల అక్కా చెల్లెళ్లు మార్చి 3, 2003న జన్మించారు. రూపురేఖలతో పాటు ఆటలు, అభిరుచి, ఆహారపు అలవాట్లు కూడా ఒకటే. వీరు గ్రేటర్ నొయిడాలోని ఆస్టర్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. సోమవారం విడుదలైన సీబీఎఈ 12వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఇద్దరికీ 95.8 శాతం మార్కులు వచ్చాయి. అంతేకాదు, ప్రతి సబ్జెక్టులో ఇద్దరికీ ఒకే రకమైన మార్కులు రావడం విశేషం. దీంతో ఇక తల్లిదండ్రులు, టీచర్ల సంతోషానికి అవధుల్లేవు. ఇప్పుడు వీరి ప్ర‌తిభ‌ను నెటిజ‌న్లు తెగ మెచ్చుకుంటున్నారు.

logo