బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 11:16:18

యూఎన్‌లో క‌శ్మీర్‌పై ట‌ర్కీ అధ్య‌క్షుడి కామెంట్‌..

యూఎన్‌లో క‌శ్మీర్‌పై ట‌ర్కీ అధ్య‌క్షుడి కామెంట్‌..

హైద‌రాబాద్‌: ట‌ర్కీ అధ్య‌క్షుడు రీసెప్ త‌యిపి ఎర్డ‌గోన్ మ‌రోసారి క‌శ్మీర్‌పై వ్యాఖ్య‌లు చేశారు. ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ట‌ర్కీ అధ్య‌క్షుడు ఎర్డగోన్ త‌న వ‌ర్చువ‌ల్ సందేశంలో క‌శ్మీర్ అంశాన్ని ప్ర‌స్తావించారు.  అయితే క‌శ్మీర్‌పై ట‌ర్కీ చేసిన వ్యాఖ్య‌ల‌ను భార‌త్ ఖండించింది.  యూఎన్‌లో భార‌త ప్ర‌తినిధిగా ప‌నిచేస్తున్న‌ ‌తిరుమూర్తి త‌న ట్విట్ట‌ర్‌లో ఎర్డ‌గోన్‌ వ్యాఖ్య‌ల‌ను  త‌ప్పుప‌ట్టారు. ఇత‌ర దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని ట‌ర్కీ గ్ర‌హించాల‌ని, త‌న స్వంత పాల‌సీల‌పై మాత్ర‌మే వ్యాఖ్యానించాల‌న్నారు.  యూఎన్ 75వ సంవ‌త్సరం సంద‌ర్భంగా ఎర్డ‌గోన్ త‌న ప్రీరికార్డ్ వీడియోలో మాట్లాడుతూ.. ద‌క్షిణ ఆసియాలో శాంతికి క‌శ్మీర్ స‌మ‌స్య కీల‌క‌మ‌ని, అది ఇంకా ర‌గులుతూనే ఉన్న‌ద‌ని, క‌శ్మీర్‌లో 370 ఆర్టిక‌ల్ ర‌ద్దుతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలంగా త‌యారైంద‌ని ఆరోపించారు.  యూఎన్ ఆదేశాల‌కు అనుగుణంగా క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఎర్డ‌గోన్ తెలిపారు. పాకిస్థాన్‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగి ఉన్న ట‌ర్కీ అధ్యక్షుడు ఎర్డ‌గోన్‌.. గ‌త ఏడాది కూడా క‌శ్మీర్ అంశాన్ని త‌న సందేశంలో ప్ర‌స్తావించారు. ఇండోపాక్ స‌మ‌స్య‌పై మూడ‌వ దేశ ప్ర‌మేయం అవ‌స‌రం లేద‌ని గ‌తంలో ప‌లుమార్లు ఇండియా స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.logo