బుధవారం 03 జూన్ 2020
National - May 16, 2020 , 10:49:09

55 రోజుల తర్వాత శ్రీవారి లడ్డూ.. బారులు తీరిన భక్తులు

55 రోజుల తర్వాత శ్రీవారి లడ్డూ.. బారులు తీరిన భక్తులు

తిరుపతి : కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం విదితమే. శ్రీవారి మహాప్రసాదం అంటే భక్తులకు ఎంతో ప్రీతి. శ్రీవారి లడ్డూ భక్తులకు అందుబాటులో లేక 55 రోజులు అవుతోంది. ఈ క్రమంలో 55 రోజుల తర్వాత శ్రీవారి లడ్డూలు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి కల్యాణోత్సవ లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని సైతం విక్రయించేందుకు టీటీడీ నిర్ణయించింది. గతంలో లాగా ఎలాంటి షరతులు లేకుండా భక్తులు కోరినన్ని లడ్డూలు, వడ ప్రసాదాలను భక్తులకు టీటీడీ సిబ్బంది అందజేస్తుంది. నేటి నుంచి టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరుగుతున్నాయి. శ్రీవారి లడ్డూ కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణోత్సవం లడ్డూ రూ. 200, వడ రూ. 100 చొప్పున భక్తులకు విక్రయిస్తున్నారు. శ్రీవారి లడ్డూ అందుబాటులోకి రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


logo